Tuesday, January 15, 2013

వంపు సొంపు నీ బుగ్గ కెంపు




వంపు సొంపు నీ బుగ్గ కెంపు
ముందు వెనుక నీ బొమ్మ టాప్
ఊపే ఊపు నీ నడుము షేకు
ఊహల నిండా నీ రూపే మాకు
కంటపడక దాచిపెట్టితే పైట మాటున పడుచుతనం
వెంటపడక వూరకుందురా ఫేంటులేసిన కుర్రజనం
బయటపడక అణచివేస్తే నీ లోపలున్న ఆడతనం
నిదురరాక కలలే కనదా మాలోని మగతనం

షష్టిపూర్తి  ముసలాళ్ళే, బుసలు కొట్టే నీ మిసమిస చూస్తే
పెళ్ళికాని ప్రసాదులే, కలలు కనే నీ రూపం కంటే
కలంపట్టి కుర్రాళ్ళందరూ, కవులుకారా నువ్వు ప్రేరేపిస్తే
కత్తివిడిచి రౌడీలందరూ, వెంటపడరా నువ్వు కన్నేగీటితే
ఎంసెట్ ఎంట్రన్స్ కన్నా, టఫ్ అయినదీ కాంపిటేషన్
తత్కాల్ బుకింగ్ కన్నా, పొడుగైనదీ క్యూలైన్

బ్రహ్మచారి బ్రతుకులకే, బూజు దులిపెను నీపై మోజు
దేవదాసు వేదనకే, తెరలు దించె నువ్వు పిలిచే పిలుపు
టాప్ క్లాస్ క్రికెటరే, క్లీన్ బౌల్డ్ నువ్వు విసిరే చూపుకు
కాషాయం సన్యాసులకే, కసిని పెంచు నీ నడుము వంపు
ఫ్యాషన్ ఛానల్ కన్నా, ఫేమస్ నీ డ్రెస్సింగ్
ఉగ్రవాది చర్యల కన్నా, యమ డేంజర్ నీ స్మైలింగ్