Saturday, January 5, 2013

Better Be Alone


ఒంటరితనం ఓ వరం 
ఒంటరైపోవడం ఓ శాపం 
మనసు లేని మనుషుల మధ్య 
పండగైనా దండగే 
మరకలు లేని మనసుల మధ్య 
ప్రతిరోజూ పండగే 

వేడుకైతే జీవితం 
వెంటరాదు ఒంటరితనం 
ఇంటిలో ఒంటిగా నీవున్నా 

పలకరింపుల బంధుత్వం 
బోరుకొట్టదా ప్రతినిమిషం 
మెండుగా నిండుగా ఎందరున్నా 

ఉండిపో ఒంటరిగా నీకు నువ్వు బంధువైతే 
కలసిపో అందరిలో మంచి మనసులే ఎదురైతే 

ప్రాణమైతే నీ స్నేహం 
మరచిపోవునా నీ హృదయం 
దూరంగా విడి విడిగా మీరున్నా 

తప్పనిసరి సావాసం   
మనసువిప్పాలంటే మొహమాటం
మందువిందులో కలసి చిందులేసినా  

సోలోగా సాగిపో నీకు నువ్వు ఫ్రెండైతే 
స్నేహమే చేసుకో మొహమాటంలేని మనసు ఎదురైతే