Saturday, January 19, 2013

PAISA




నాణానికో బొమ్ముంటుంది
బొమ్మ వెనుక బొరుసుంటుంది
బొమ్మ బొరుసు ఆట వెనుక
చేతులుమారే నోటుంటుంది

రేసుకో రేటుంటుంది
రేసులో పడితే పరిగెడుతుంది
రేసు గుర్రం ఫోర్సు వెనుక
దిమ్మతిరిగే సొమ్ముంటుంది

షార్ట్ కట్ టఫ్ అయినా
రాంగ్ రూట్ రిస్క్ అయినా
పైసా కోసం పరిగెత్తడమే జీవితం
బంపర్ డ్రా మిస్ అయినా
బెట్టింగ్ సొమ్ము లాసయినా
పైసా కోసం ప్రాకులాడడమే జీవితం

కళ్యాణం చేస్తే కట్నం, విడాకులిస్తే భరణం 
పెళ్లికైనా పెటాకులకైనా పైసాయే సాక్ష్యం 
మంచమెక్కితే జననం, మంచందిగితే మరణం
మధ్యలో సాగే ప్రయాణానికి పైసాయే ప్రామాణికం

చచ్చినోడి వాకిట్లో చావుభాజా సందట్లో
పాడెపై జల్లటానికి కావాలిరా పైసా
దేవుడిగుడి ముంగిట్లో భక్తజనం భజనల్లో
హుండిలో వేయటానికి కావాలిరా పైసా

రియల్ ఫైటులో నువ్వు ఓడిపోయినా
కాక్ ఫైటులో గెలిచే పుంజు పెంచరా
లైఫ్ రేసులో నువ్వు వెనకపడినా
హార్స్ రేసులో గెలుపు గుర్రమెక్కరా

చావడం పాపం, ఒకరిని చంపడం నేరం
చచ్చినా చంపినా అది పైసా చేసే అరాచకం 
బ్రతకడం యోగం, బ్రతికించడం యాగం
బ్రతికినా బ్రతికించినా అది పైసాతోనే సాధ్యం

షావుకారు అంగట్లో, పూట గడిపే రేటులో
ఉప్పు పప్పు కొనడానికి కావాలిరా పైసా
అంగడిబొమ్మ నట్టింట్లో, పైట జారే నైటులో
వయసు కోరిక తీరడానికి కావాలిరా పైసా

బ్రతుకు ఆటలో నువ్వు జోకరైనా
పేకాటలో నువ్వు షో తిప్పరా
బడి చదువులో నువ్వు జీరో అయినా
నెంబరు గుండులో గెలిచే అంకె పట్టరా