Wednesday, December 26, 2012

How much your VOTE?



వోటుకో నోటిచ్చే అమ్మేసుకొంటే
నిషా మత్తులో బ్రతుకు ఉరేసుకొంటే
బజారు వీధిలో సారాయి కొట్టులో
సరుకేసుకుంటే చావుకు బాటేసుకుంటే

తాగేసి వాగేసి తూలుతూ పోతుంటే
అయిదేళ్ళ కొకసారి మహరాజు నువ్వంటే
నీ బిడ్డ భవిష్యత్తు నడ్డిపై తన్నుతుంటే
బిరియాని పాకెట్ భోంచేసి పడుకుంటే

మళ్లోచ్చే ఈ రోజు అయిదేళ్ళు పోయాక
ఆలోపు ప్రతీ రోజు నువ్వు చస్తూ బ్రతికాక

శీలమంటి వోటునమ్మి అశ్లీల మైపోకు
చీరకోసం వోటుతో బ్రతుకుపై పోటేయకు
కులంకోసం మతంకోసం వోటేస్తానని మాటీయకు
నీ వోటుకే రేటు పెంచి రాత్రికి రాత్రి అమ్మేయకు

రాజయిన పేదయిన ఒక్కటే ఆయుధం
యువకుడైన ముసలయిన మారదు ఓటు నైజం