Saturday, January 5, 2013

Manassu




ప్రతి మనిషికి మనసుంటది
ఆ మనసేదో చెబుతుంటది
ఎవరెవరినో ప్రేమిస్తది
వేరెవరినో ద్వేషిస్తది 

గెలుపులో గెంతేస్తది
ఓటమిలో వర్షిస్తది 
నచ్చితే నడిపిస్తది
కాదంటే కుదిపేస్తది

వేదంలా ఘోషిస్తది
వేమన శతకం వల్లిస్తది
హృదయంలో ఉదయిస్తది
వెలుగులనే చూపిస్తది

ఆశిస్తే మనస్సు శ్వాసించే మనిషి
నిరాశతో నిరసిస్తే నీరసించే వయస్సు 

వయసుకో యాస మనసులో ధ్యాస
బ్రతుకుకే ఇరుసా మనిషిలోని మనసా

మనిషికే బహుసా దైవమే మనసా 
మనసుపడే వరస విధిరాతే తెలుసా